List of Landidates of Janasena : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అయితే ప్రధాన పార్టీలు అయినటువంటి టిడిపి, వైసిపి, బిజెపి, జనసేన ఎన్నికల వ్యూహాల్లో ఎవరికి వారు నిమగ్నమై ఉన్నారు. అధికార పార్టీ వైసిపి అభ్యర్థులు ఎంపికలు చేస్తూ భారీ ప్రక్షాళనకు తెరతీసింది. పెద్ద ఎత్తున జగన్ అందరిని మారుస్తున్నారు. ఇకపోతే జనసేన, టిడిపి కూడా ఈ విషయంలో తమ దూకుడును పెంచాలని డిసైడ్ అయ్యాయి.
ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే, సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రత్యేకంగా భేటీలు కూడా అయ్యారు. అయితే కీలకమైన సమాచారం ప్రకారం జనసేనకు 27 అసెంబ్లీలు, రెండు లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ రెండు పార్టీల నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా మచిలీపట్నం, అనకాపల్లి లోక్ సభ
స్థానాలు జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకారం కూడా తెలిపారు అంట, అలాగే రాజంపేట సీటు పైన జనసేన పట్టుబడుతుండడంతో దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాలపై ఒక క్లారిటీ రావడంతో ఇక ఆలస్యం చేయకుండా త్వరలోనే జనసేన తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ దిశగా అడుగులు వేస్తుందని సమాచారం.
అయితే పవన్ కళ్యాణ్ భీమవరం తో పాటు తిరుపతిలోను పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికి అదే ఖరారు అయ్యే విధంగా తెలుస్తుంది. సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ముఖ్యంగా నెలిమర్ల లోకం నాగ మాధవి గజపతిపురం పడాల అరుణ, గాజువాక సుందరపు సతీష్ , భీమిలి పంచకర్ల సందీప్ లేక పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు , యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ పేర్లు, అలాగే
రాజానగరం బత్తుల బాలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, పిఠాపురం టీ టైం ఉదయ్ శ్రీనివాస్ రామచంద్రపురం చిక్కం దొరబాబు, జగ్గంపేట పాటింశెట్టి సూర్యచంద్రరావు , రాజోలు డిఎంఆర్ శేఖర్, భీమవరం పవన్ కళ్యాణ్, తణుకు విడువాడ రామచందర్రావు ,తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ,నరసాపురం బొమ్మిడి నాయకర్ , విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, తెనాలి నాదెండ్ల మనోహర్, గిద్దలూరు ఆమంచి శ్రీనివాసరావు పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితా పై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.