• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Kasarla Shyam: ‘ఊరు పల్లెటూరు’ పాటకు జాతీయ అవార్డు.. ఆ సాంగ్ లిరిక్స్ మీకోసం!

Kasarla Shyam: 'ఊరు పల్లెటూరు' పాటకు జాతీయ అవార్డు..

Sandhya by Sandhya
August 2, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Kasarla Shyam: ‘ఊరు పల్లెటూరు’ పాటకు జాతీయ అవార్డు.. ఆ సాంగ్ లిరిక్స్ మీకోసం!
Spread the love

Table of Contents

Toggle
  • Kasarla Shyam: ‘ఊరు పల్లెటూరు’ పాటకు జాతీయ అవార్డు.. ఆ సాంగ్ లిరిక్స్ మీకోసం!
      • ఊరు పల్లెటూరు సాంగ్ లిరిక్స్ మీకోసం..

Kasarla Shyam: ‘ఊరు పల్లెటూరు’ పాటకు జాతీయ అవార్డు.. ఆ సాంగ్ లిరిక్స్ మీకోసం!

 

Kasarla Shyam: తెలంగాణ పల్లె జీవితాలను, మనుషుల అనుబంధాలను ఆవిష్కరించిన ‘బలగం’ చిత్రం జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హృదయాలను హత్తుకున్న ‘ఊరు పల్లెటూరు’ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ గుర్తింపు పట్ల శ్యామ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఎంతోమంది మహామహుల తర్వాత తనకు ఈ గౌరవం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బలగం’ ఒక సాధారణ తెలంగాణ కుటుంబ కథను అసాధారణ రీతిలో ఆవిష్కరించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి, కాసర్ల శ్యామ్ రాసిన ‘ఊరు పల్లెటూరు’ పాట ప్రాణంగా నిలిచింది.

ఊరు పల్లెటూరు సాంగ్ లిరిక్స్ మీకోసం..

ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు
ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా
నీ పాసుగాల

కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే
రామ రామ రామ

తలకు పోసుకుందె నా నేల తల్లే
అలికి పూసుకుందె ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే

హే తెల్ల తెల్లాని పాలధార ఓలే
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే
జంటగ మోగుత ఉంటయిరా

నాగలి భుజాన పెట్టుకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా

సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సెల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల చప్పట్లు

గడ్డి మోపులు కాల్వ గట్టులు
సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల

ఊరు పల్లెటూరు
దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు
దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు

వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే

ఆలు మొగలు ఆడే ఆటలు
అత్త కోడండ్ల కొట్లాటలు
సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు

రచ్చబండ మీద ఆటలు
చాయబండి కాడ మాటలు
వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే
సంగతే గమ్మతి

తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది

ఊరు నా ఊరు
దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు
దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు

వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే


Spread the love
Tags: National Award for Balagam MovieNational Award for Kasarla ShyamNational Award for Kasarla Shyam as Best LyricistNational Award for Ooru Palleturu SongNational Awards 2024Ooru Palleturu Song Lyricsఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్‌కు జాతీయ అవార్డుఊరు పల్లెటూరు పాట లిరిక్స్ఊరు పల్లెటూరు పాటకు జాతీయ అవార్డుకాసర్ల శ్యామ్‌కు జాతీయ అవార్డుజాతీయ అవార్డులు 2024బలగం సినిమాకు జాతీయ అవార్డు
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.