Machilipatnam Meeting:కాసేపట్లో పవన్ ర్యాలీ.. అనుమతి లేదన్న పోలీసుల వైఖరితో హై టెన్షన్ వాతావరణం
జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ సభ కాసేపట్లో మచిలీపట్నం లో అట్టహాసంగా ప్రారంభం అవబోతుంది.భారీ జనసమీకరణతో జరుగబోతున్న సభకి పోలీసుల ఆంక్షలు కూడా తోడవడంతో ఉత్కంఠతో పాటు హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ రోజు జరిగే మచిలీపట్నం ఆవిర్భావ సభకి జనసేన అధినేత పవన్కళ్యాణ్ కాసేపట్లో విజయవాడ నుండి తన వారాహి వాహనం పై ఊరేగింపుగా, భారీ ర్యాలీతో వెళ్లనున్నారు.అయితే ప్రస్తుతం ఈరోజు ఎలాంటి ర్యాలీలకి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నిన్ననే అల్టిమేటం జారిచేశారు. ఈరోజు మొత్తం మచిలీపట్నం లో పోలీస్ యాక్ట్ -30 అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే పవన్కళ్యాణ్ వారాహి వెనకాలే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా సభకి చేరుకోవాలని జన సైనికులు కూడా సిద్ధం అయ్యారు.పోలీసులు ఎలాంటి ర్యాలీలకి అనుమతి లేదని తెలిపిన సందర్బంలో, విజయవాడ నుండి మచిలీపట్నం వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.