సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి శ్రీమతి ఇందిరాదేవి గారు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి ఈరోజు హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆవిడ మరణవార్తతో టాలీవుడ్‌లో విషాదం నెలకుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇందిరాదేవి మృతికి సంతాపం తెలిపారు.