Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, గురూజీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న SSMB 28 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా ఓ క్రూరమైన విలన్ గా సీనియర్ హీరో జగపతిబాబు నటించనున్నారు. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటించనున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ఈ మూవీ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. SSMB 28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ని మార్చ్ 22న ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ రూ.81 కోట్లకి దక్కించుకోగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ హక్కుల కోసం భారీ డీల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓవర్సీస్ హక్కులను రూ. 24 కోట్లకు కోట్ చేస్తున్నారట. అయితే ఇందులో USA హక్కులు రూ. 16 కోట్లట. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ భారీ బిజినెస్ చేస్తున్న ఈ మూవీ విడుదల తర్వాత ఏ మేరకు విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..