Mahesh, Trivikram SSMB28: టాలీవుడ్ లో మహేష్ బాబు క్రేజ్ మామూలుగా ఉండదు. ఆ క్రేజ్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోడైతే..? ఆ అంచనాలు ఏ రేంజ్ లీక్ ఉంటాయో తెలుసు కదా.. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది.
Also Read : వీర సింహా రెడ్డి మూవీ రివ్యూ
హారికా హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా #SSMB2. పూజ హెగ్డే హీరోయిన్. థమన్ మ్యూజిక్ అందిసగున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. ఇప్పటి వరకూ ఓ టీజర్ గానీ.. ట్రైలర్ గానీ లేదు.. ఓ సాంగ్ కానీ డైలాగ్ కానీ రిలీజ్ అవలేదు.. అంతెందుకు అసలు షూటింగ్ కూడా స్టార్ట్ అవలేదు. కానీ అప్పుడే నెట్ ఫ్లిక్ సంస్థ ఈ సినిమా OTT రైట్స్ సొంతం చేసుకుంది..అదీ మహేష్ బాబు క్రేజ్.
ఈ విషయన్ని నెట్ ఫ్లిక్ అఫిషియల్ గా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. “పెను తుఫాను తలొంచి చూడడానికి అయినా మేము రెడీ.. మీరు ? ” అంటూ తన ఖాతాలో ఆ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని తెలిపింది.
Penu thuphaanu thalonchaina choodaataniki memu ready. Meeru?#SSMB28 is coming on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! 🤩#NetflixLoEmSpecial #NetflixPandaga #SSMB28 pic.twitter.com/34teGAQz2m
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023