Man Rejects Marriage:తెల్లారితే పెళ్లి అంతలోనే ఈ అమ్మాయిని నాకు వద్దు బాబోయ్ అన్న వరుడు… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కాలం మారింది..
ఈ టెక్నాలజీ రోజుల్లో ఏది చేసినా వింతగా, కాసింత కొత్తగా,ఇంకో అడుగు ముందుకు వేసి అందరూ ఆశ్చర్యపోయేలాంటి చేష్టలు కూడా చేస్తున్నారు జనాలు. చిన్న చిన్న కారణాలకి వింత సాకులు చెప్తూ కూడా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు..ఇది ఒక అంశానికి మాత్రమే పరిమితం అనేలా కాకుండా అన్ని అంశాల్లో తమ పైత్యం, వింత పోకడలు ప్రదర్శిస్తున్నారు ..పైగా చిన్న చిన్న కారణాలకి కూడా పోలీసుల వరకు వెళ్లి వింతలు విశేషాలు కూడా చూస్తున్నాం చాలానే చూస్తున్నాం ఈ మధ్య .అయితే కొన్ని విషయాల్లో నవ్వు తెప్పించేలా, ఇలా కూడా చేస్తారా అనే సంఘటనలు కూడా జరుగుతున్నాయి
తాజాగా ఇలాంటిదే ఒక సంఘటన అయోధ్యలో జరిగింది.ఓ పెళ్ళికి సంబంధించిన విషయంలో వరుడు, వధువుకి జుట్టు సరిగా లేదని ఏకంగా పెళ్లే రద్దు చేసుకున్నాడు. దీనితో వధువు తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.పెళ్లిచూపుల రోజునే అన్నీ మాట్లాడుకుని వరుడు వధువు నచ్చాక, పెళ్లి రేపు అనగా వరుడు చెప్పిన కారణంతో తెల్లబోయిన వధువు తల్లిదండ్రులు ఎంత బతిమాలినా..ఎట్టి పరిస్థితుల్లో అమ్మయిని చేసుకునేదే లేదని చెప్పేశాడు.అయితే ముందే అన్నీ మాట్లాడుకొని ఇరువురు ఒకరినినొకరు ఇష్టపడ్డాకే పెళ్లి వరకు వచ్చిందని.. తీరా ఇప్పుడు వరుడు కట్నం కోసం కావాలనే వరుడు అబద్దం ఆడుతున్నాడని పోలీసులని ఆశ్రయించారు వధువు బంధువులు.