Manchu Lakshmi: హౌ డేర్ యు ఆస్క్ మి దట్ క్వశ్చన్.. జర్నలిస్టుపై మంచు లక్ష్మీ ఫైర్
Manchu Lakshmi: సినీ నటి, నిర్మాత, హోస్ట్ మంచు లక్ష్మి నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇటీవల ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నటించి, నిర్మించిన చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కొన్న ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు.
“50 ఏళ్లకు దగ్గరవుతున్న మీరు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు?” అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదే ప్రశ్న మీరు ఒక మగ నటుడిని అడిగేవారా? హౌ డేర్ యు ఆస్క్ మి దట్ క్వశ్చన్? మహేష్ బాబుని షర్ట్ విప్పి తిరుగుతున్నావ్ అని అడగగలరా? అదే ఆడపిల్లని ఇలా అడగడం ఏంటండి? ఇది జర్నలిజం పేరుతో చేసే నెగిటివ్ వైబ్స్” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక పురుష నటుడు వయసు పెరిగినా షర్ట్ విప్పి డ్యాన్స్ చేయగలడు. కానీ మహిళల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్యాయమని అన్నారు. మహిళల జీవితం ఇతరులపై ఆధారపడి ఉంటుందని, వారికి స్వేచ్ఛ చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు.
https://x.com/urstrulysai07/status/1967616147249102900
“విడాకులు తీసుకున్న తర్వాత మీరు మాకొద్దు అని పక్కన పెట్టేశారు. అదే ఒక మగాడు విడాకులు తీసుకుంటే ఈ ఇండస్ట్రీలో నువ్వు మాకొద్దు అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా?” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ కావడంతో, నెటిజన్లు మంచు లక్ష్మికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
“ఒక మహిళ ఏం వేసుకోవాలి అనేది ఆమె వ్యక్తిగత హక్కు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. పోలీసు వ్యవస్థ మరియు రాజకీయ కుట్రల నేపథ్యంలో రూపొందిన ఈ థ్రిల్లర్ చిత్రంలో మంచు లక్ష్మితో పాటు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు.
