Manchu Lakshmi: అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఫ్యాన్‌పై ఘాటుగా స్పందించిన మంచు లక్ష్మీ
Manchu Lakshmi: ప్రముఖ నటి మంచు లక్ష్మీ దుబాయ్‌లో జరిగిన SIIMA 2025 అవార్డుల వేడుకలో ఒక అభిమాని అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేడుకలో పాల్గొన్న మంచు లక్ష్మీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారి కోరిక మేరకు ఆమె వారితో సెల్ఫీలు తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
అయితే అదే సమయంలో ఆమె వెనుక వైపు నిలబడిన ఒక వ్యక్తి అసభ్యంగా కామెంట్ చేయడంతో లక్ష్మి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒరేయ్! దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. టైమ్, సెన్స్ ఏమీ లేదు రాస్కెల్స్!” అంటూ గట్టిగా హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవడంతో ఆమెకు నెటిజన్ల నుండి భారీ మద్దతు లభిస్తోంది. సినీ తారల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు.
ఈ ఘటన జరిగినప్పటికీ, మంచు లక్ష్మీ వెంటనే తన కోపాన్ని అదుపు చేసుకొని అక్కడున్న అభిమానులతో సానుకూలంగా వ్యవహరించారు. సెల్ఫీలు అడిగిన వారికి నవ్వుతూ ఫోటోలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ముంబైలో కూడా తెలుగు ఫోటోగ్రాఫర్లు నన్ను ‘అక్కా’ అని పిలుస్తారు” అని చెప్పారు. ఒక చిన్నారి సెల్ఫీ అడిగినప్పుడు ఆమె పేరు అడిగి, ప్రత్యేకంగా ఫోటో దిగి తన అభిమానాన్ని చాటుకున్నారు.
సినిమాల విషయానికొస్తే, మంచు లక్ష్మీ ప్రస్తుతం తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. దీనితో పాటు, ఆమె ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘ది రైటర్స్ ఇండియా’ షోలో ఒక కంటెస్టెంట్‌గా కూడా పాల్గొన్నారు. గత ఏడాది ‘ఆదిపర్వం’తో పాటు, జియో హాట్‌స్టార్ సిరీస్ ‘యక్షణి’లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించారు.
