Manchu Manoj : డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మనోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షాకార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మనోజ్ ఎప్పుడో హింట్ ఇచ్చాడు.
మొత్తానికి నిన్న రాత్రి మంచు మనోజ్ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఫిలింనగర్ లోని మోహన్ బాబు నివాసంలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్, మౌనిక ఒక్కటయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తెనే మౌనిక. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటి కాగా ఇద్దరికి ఇది రెండో వివాహమే.