MarBurg Virus : మరో కొత్త వైరస్..9 మంది మృతి..!!
ఏ ముహూర్తానా ఆ చైనా నుండి కరోనా వచ్చి ప్రపంచం మొత్తం తలకిందులు అయిందో కానీ.. అప్పటినుండి ఈ వైరస్ ల బెడద తప్పట్లేదు..
ఎలాగోలా కరోనాని జయించినా.. తరువాత ఓమిక్రాన్ అని
ఆ తరువాత ఇంకోటి ఒకదానికొకటి పుట్టుకొచ్చి ఆర్థిక వ్యవస్థల్ని.. ప్రజల ప్రాణాల్ని హరించేసి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి..
తాజాగా ఆఫ్రికన్ దేశం గినియాలో కొత్త వైరస్ కలకలం రేపుతుంది. “మార్ బర్గ్” అనే కొత్తరకం వైరస్ వల్ల ఇప్పటికే 9 మంది మృత్యువాత పడ్డట్టు WHO వెల్లడించింది.
ఇది “ఏబోలా” వ్యాధిని పోలి ఉంటుందని, ఈ వైరస్ గబ్బిలాల నుండి మనుషులకి చాలా వేగంగా సంక్రమిస్తుంది అని.. పైగా మరణాల శాతం 88% గా ఉంటుందని బాంబు పేల్చింది.
ఈ వైరస్ లక్షణాలు :
తీవ్రమైన తలనొప్పి, అలసట, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి అని.. పైగా వ్యాక్సిన్ లేదని కూడా WHO తెలిపింది..
ఇవి కూడా చదవండి..