Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి అందాల విందు.. బ్లాక్ డ్రెస్‌లో మైమరిపిస్తున్న బ్యూటీ
Meenakshi Chaudhary: ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యుటీ మీనాక్షి చౌదరి. ఒకప్పుడు సెకండ్ హీరోయిన్‌గానే సరిపెట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా మారిపోయింది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాదిలోనే మీనాక్షి చౌదరి ఇప్పుడు వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.
ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ చేసిన ఫోటోషూట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆమె చూపు తిప్పుకోనివ్వని అందం, అద్భుతమైన స్టైలింగ్‌తో ఫోటోలకు పోజులిచ్చింది. నలుపు రంగు దుస్తులు మీనాక్షికి మరింత సొగసును తీసుకొచ్చాయి. ఆమె కళ్లు, ముఖంలో కనిపించిన హావభావాలు, ఒరచూపులు కట్టిపడేస్తున్నాయి.
మీనాక్షికి పెరిగిపోతున్న అభిమానులు..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో లైక్‌లను పొందాయి. అభిమానులు, సినీ విశ్లేషకులు ఆమె స్టైల్‌ను, అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీనాక్షి చౌదరి కేవలం నటిగానే కాకుండా, ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె ప్రతి లుక్‌లోనూ ఒక కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ, అభిమానులను నిరంతరం ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ నలుపు రంగు దుస్తుల్లోని ఫోటోషూట్ ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఆమెకు పెరుగుతున్న అభిమానగణం, సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ దీనికి నిదర్శనం. భవిష్యత్తులో ఆమె మరిన్ని అద్భుతమైన ఫోటోషూట్‌లతో, సినిమాలతో ప్రేక్షకులను అలరించడం ఖాయం.
తొలుత మోడలింగ్ వైపు వెళ్లిన మీనాక్షి
హర్యానాలోని ఆర్మీ కుటుంబంలో జన్మించింది మీనాక్షి చౌదరి. ఆమె తండ్రి బీఆర్ చౌదరి భారత సైన్యంలో కల్నల్‌గా విధులు నిర్వర్తించారు. మీనాక్షి ఆల్‌రౌండర్ అనే చెప్పాలి. ఆమె డాక్టర్ కూడా. స్టేట్ లెవల్ స్విమ్మర్‌గా, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా పలు టోర్నమెంట్స్‌లో పాల్గొంది. తొలుత మోడలింగ్ వైపు వెళ్లిన మీనాక్షిచౌదరి.. 2018లో ఫెమినా మిస్ హర్యానా టైటిల్ ను గెలుచుకుంది. మిస్ ఇండియా పోటీల్లో హర్యానా తరఫున రన్నరప్‌గా నిలిచింది. దేశంలోని టాప్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేసిన మీనాక్షి చౌదరికి తర్వాత సినిమాలలో అవకాశాలు వచ్చాయి.