Chiranjeevi Anil Ravipudi: ‘మీసాల పిల్లా’.. గ్రేస్‌తో అదరగొట్టేసిన చిరు.. ‘మన శంకర వరప్రసాద్ గారు’కి మరింత హైప్
Chiranjeevi Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి తన పాత వైభవాన్ని గుర్తుచేసే క్లాస్, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తిరిగి రాబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ప్రోమో ‘మీసాల పిల్లా’ అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. దసరా కానుకగా రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో చిరు స్టైల్, గ్రేస్, అద్భుతమైన ఎనర్జీ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
‘మీసాల పిల్లా’ సాంగ్‌ను చిత్ర యూనిట్ సభ్యులు “మెగా గ్రేస్ సాంగ్” అని పిలుస్తున్నారు. ఈ పాట ప్రోమోలో చిరంజీవి తన క్లాసిక్ డాన్స్ మూమెంట్స్‌తో, స్టైలిష్ లుక్స్‌తో, చిరునవ్వులతో ఎంతగానో ఆకట్టుకున్నారు. 70 ఏళ్ల వయస్సులో కూడా ఆయన అదే గ్రేస్‌తో స్టెప్పులేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. హీరోయిన్ నయనతారతో కలిసి స్క్రీన్‌పై చిరు రొమాంటిక్ మూమెంట్స్‌లో కనిపించడం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
ఈ పాటకి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, లెజెండరీ గాయకుడు ఉదిత్ నారాయణ్ గాత్రం అందించారు. చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు పాడిన ఉదిత్ నారాయణ్, మళ్లీ మెగా మ్యూజిక్ వైభవాన్ని గుర్తుచేస్తూ ఈ పాటకు ప్రాణం పోశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రంలో చిరంజీవిలోని అన్ని షేడ్స్‌ను చూపించబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. అందుకు సంకేతంగానే ఈ ‘మీసాల పిల్లా’ ప్రోమో నిలిచింది. ఇందులో చిరంజీవి టైమింగ్, హ్యూమర్ బీట్‌లు స్పష్టంగా కనిపించాయి.
సాహు గరపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత విభాగంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని సమాచారం. యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పాటలు మెగా క్లాస్, మెగా స్వాగ్, మెగా విక్టరీ మాస్, మెగా ఎమోషన్ అనే నాలుగు వేర్వేరు కాన్సెప్ట్‌లతో రూపొందుతున్నాయి. ప్రతి పాటలోనూ చిరంజీవి కొత్త యాంగిల్స్ కనిపించనున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని సంక్రాంతి 2026 సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.