Mifepristone : అబార్షన్ కు సంభందించిన డ్రగ్ “మిఫిప్రిస్టోన్” అందుబాటులో ఉంచాల్సిందే అని అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.ఇదివరకే టెక్సాస్ కోర్టు ఈ మిఫిప్రిస్టోన్ పై ఆంక్షలు విధించింది. ఇది ఇలా ఉండగా వాషింగ్టన్ కోర్టు, మిఫిప్రిస్టోన్ డ్రగ్ ను 13 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచాలని తీర్పు ఇచ్చింది. ఇలా రెండు కోర్టుల తీర్పులు వేర్వేరుగా వెలువడడంతో సందిగ్ధతలో ఉన్న అమెరికకు .
తాజాగా యూఎస్ సుప్రీం కోర్టు గర్భనిరోధక మాత్రలపై క్లారిటీ ఇచ్చింది. ఈ మాత్రలను వాడుకోవచ్చు అని, ప్రతి చోటా అందుబాటులో ఉండేలా చూడాలి అంటూ ఇచ్చిన తీర్పుతో సందిగ్ధత పోయింది. అయితే గతంలో అబార్షన్ పిల్స్ ను నిషేధిస్తూ టెక్సాస్ కోర్టు వెల్లడించిన తీర్పును ,సుప్రీం కోర్టు రిజర్వ్ లో ఉంచింది.
వారం రోజుల పాటు దీనిపై ఎలాంటి విచారణ జరగక పోవడం వల్ల దీనికి సంబందించిన సంస్థలు, వ్యక్తులు సుప్రీం కోర్టులో ఈ విషయాన్ని లేవనెత్తారు. మిఫిప్రిస్టోన్ పిల్స్ కు మరో పేరు ఆర్‌యూ 486. శృంగారం చేసిన తర్వాత మిఫిప్రిస్టోన్ మాత్రలు వాడడం వల్ల ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవడంతో, ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది.
అయితే మిఫిప్రిస్టోన్ వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ మాత్రల వల్ల కాళ్ళు, చేతులు తిమ్మిరి రావడం, దీర్ఘకాలికంగా భారీ రక్తస్రావం, వికారం, జ్వరం, వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మిఫిప్రిస్టోన్ పిల్స్ వాడే 100 మందిలో ఒకరికి భారీ రక్తస్రావం వల్ల శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి.