Milk In A Dream : ప్రతి ఒక్కరికి రాత్రి నిద్ర సమయంలో ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కలలో మనం రోజువారి చేసిన పనులు, వాటి గుర్తుగా కలల రూపంలో వస్తూనే ఉంటాయి. కొంతమందికి తరచుగా కొన్ని పదార్థాలు, కొన్ని వస్తువులు ఎక్కువసార్లు కలలో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి కలలు రావడం వెనుక ఒక అర్థం దాగి ఉంది అని మన శాస్త్రలల్లో చెప్తారు.
మన కలలో వచ్చే వస్తువులను బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది శాస్త్రాలలో లిఖించబడి ఉంది. వాటిని బట్టి రాబోయే రోజులలో మన జీవితంలో వచ్చే మార్పులను మనం గమనించుకోవచ్చు. ఇలా వచ్చే కొన్ని రకాల కలలలో కొంతమందికి పాలు కలలోకి వస్తూ ఉంటాయి. పాలు కలలోకి రావడం వల్ల వారి జీవితం ఎలా ఉండబోతుంది.
అలా రావడం శుభమా లేక ఆశుభమా అనే విషయం తెలుసుకుందాం.. కలలో పాలు వేడి పొగలు కక్కుతున్నట్లుగా కనిపిస్తే వారి భవిష్యత్తు చాలా ఆనందమయంగా సాగుతుందని అర్థము. అలాగే వారి కెరియర్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అనడానికి సంకేతం. ఉద్యోగాల్లో వాళ్ళు నిలదొక్కుకుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
కొంతమందికి కలలో పాలు పోస్తున్నట్టుగా వస్తుంది. ఇలా రావడం వారి జీవితాల్లో ఏదో అనర్థం జరుగుతుందని సంకేతం. చాలామందికి పాల గిన్నెలు చేతులో నుండి జారి పడిపోయినట్టుగా కలలు వస్తుంటాయి. ఇది ఎదో కీడు జరగబోతుంది అనడానికి సంకేతం. పాలల్లో చక్కెర కలుపుతున్నట్లుగా కల వస్తే శుభ సూచకంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
కలలో పాలు తాగుతున్నట్టుగా వస్తే అది శుభసూచకంగా పరిగణించాలి. వారి భవిష్యత్తు బాగుంటుందని, వారు నలుగురికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థము. కలలో పాలు విరిగిపోయినట్లుగా గనక వస్తే శాస్త్ర ప్రకారం ఇంట్లో ఏదో అశుభం జరగబోతుందని అలాగే ఆర్థిక సమస్యలు తలెత్తబోతున్నాయని ముందుగా హెచ్చరించినట్లు భావించాలి.