Ministers of Telangana : తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అయితే రేవంత్ రెడ్డి తో పాటు ఇంకా ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణాలు స్వీకారం చేయబోతున్నారు. వారికి సంబంధించి వారి పేర్లను విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రుల జాబితాలో ఉన్న వారికి రేవంత్ రెడ్డి ఫోన్లు చేస్తున్నారు.
సమయానికి అందరూ ప్రమాణస్వీకారం స్థలానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా మిగతా అధికారణకు సంబంధించి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తున్నారు. మిగతా వారికి ఏ, ఏ శాఖలు కేటాయిస్తారో చూడాలి.