Rithika Nayak: చూపులతో పిచ్చెక్కిస్తున్న మిరాయ్ బ్యూటీ.. శారీలో అదిరిపోయిందిగా..!
Rithika Nayak: తాజాగా విడుదలైన ‘మిరాయ్’ సినిమాతో యువతకు కలల రాణిగా మారిపోయింది హీరోయిన్ రితికా నాయక్. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతుండగా, ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల దృష్టి అంతా రితికాపైనే పడింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రితికా వ్యక్తిగత జీవితం, కెరీర్ విశేషాలపై ఒక లుక్కేద్దాం.
రితికా నాయక్ 2000వ సంవత్సరం అక్టోబర్ 27న ఢిల్లీలో జన్మించారు. ఒడిశా కుటుంబానికి చెందిన వీరి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. రితికా చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. 2019లో ‘టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ పోటీల్లో విజేతగా నిలిచి తన అందం, ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.
మోడలింగ్ తర్వాత సినీరంగం వైపు దృష్టి సారించిన రితికా.. టాలీవుడ్‌లోనే తన అరంగేట్రం చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో వసుధ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు గాను ‘సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ’ కేటగిరీలో అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి మెప్పించారు.
ఈ సినిమాల తర్వాత రితికాకు ‘మిరాయ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇందులో ఆమె నటన, క్యూట్ లుక్స్ యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా విజయం తర్వాత రితికాకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ‘డ్యూయెట్’, ‘వీటీ 15’ చిత్రాల్లో నటిస్తున్నారు.
రితికా నాయక్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె స్టైలిష్ లుక్స్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందంతో పాటు నటనలోనూ మంచి మార్కులు సంపాదించుకున్న రితికా భవిష్యత్తులో టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.