Modi road show in Hyderabad : తెలంగాణలో ఎన్నికల పోరు ప్రచార జోరు ముగియడానికి సమయం ఆసన్నమైంది. చివరి మూడు రోజులను అన్ని పార్టీలు చాలా బాగా ఉపయోగించుకున్నాయని చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ప్రధాని మోదీ చివరి మూడు రోజుల ఫోకస్ ని మొత్తం తెలంగాణ పై పెట్టారు. దాంట్లో భాగంగానే ఆయన హైదరాబాదులో రోడ్ షో నిర్వహించారు.
సిటీలోని కీలక నియోజకవర్గాల మీదుగా ప్రధాని మోడీ కొన్ని కిలోమీటర్ల కొద్ది రోడ్ షో చేస్తూ, నగరంలోని చాలా ప్రాంతాలను చుట్టేశారు. దీనికి భారీ ఎత్తున బిజెపి అభిమానులు, ప్రజలు పాల్గొని ప్రధాని మోడీకి తమ మద్దతు తెలిపి విశేషంగా స్పందించారు. ఆయన పైన పూల వర్షం కురిపించారు.

మోడీ కూడా తనదైన శైలిలో స్పీచ్ ఇస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ, బిజెపి వస్తే లాభాలను తెలియజేస్తూ ముందుకు సాగారు. మరియు ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించిన అక్రమాల గురించి ఆయన తెలుగులో స్పీచ్ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు.
స్వయంగా ప్రధాని మోడీ బరిలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని ఈ తీరుగా నిర్వహించడంతో బీఆర్ఎస్ లో వణుకు పుట్టిందని చెప్పవచ్చు. మరోవైపు మోడీకి విశేషంగా ప్రజాధరణ లభించడం కూడా దీనికి నిదర్శనం. ఏది ఏమైనప్పటికీ విజయం ఎవరి సొంతం అవుతుందో డిసెంబర్ 3వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.
