Paradise – Mohanbabu: నాని ‘ప్యారడైజ్’ సెట్స్‌లోకి మోహన్‌బాబు ఎంట్రీ..
Paradise – Mohanbabu: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే ప్రత్యేకమైన, విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతూ, ఇటీవల అగ్ర నటుడు మోహన్‌బాబు ఈ సినిమాలో నటిస్తున్నారని ఆయన కుమార్తె మంచు లక్ష్మి ఒక సినిమా వేడుకలో ప్రకటించారు. తాజాగా, మోహన్‌బాబు బుధవారం సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయనపై కీలక సన్నివేశాలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిత్రీకరిస్తున్నారు. నాని, మోహన్‌బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వారిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఒక కొత్త వైబ్రేషన్‌ను ఇస్తాయని ఇన్‌సైడ్ టాక్.
ఈ చిత్రంలో నాయిక ఎవరు అనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, యువ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, మరో ప్రముఖ నటి సోనాలి కులకర్ణి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత కెమెరామెన్ జి.కె.విష్ణు ఛాయాగ్రహణం అందించగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.
సికింద్రాబాద్ నేపథ్యంలో సాగె కథనంతో ఈ సినిమా రాబోతుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోందట. శ్రీకాంత్ ఓదెల రెండవగా వస్తున్న ది ప్యారడైజ్ తో నేచురల్ స్టార్ నానిని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో చూపిస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
‘ది ప్యారడైజ్’ సినిమాలో తిరుగుబాటు, నాయకత్వం, తల్లీకొడుకుల అనుబంధం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని టీజర్, పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ సహా మొత్తం 8 భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ‘దసరా’ రికార్డులను తిరగరాస్తుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.