The Paradise: రగ్గడ్ & పవర్‌ఫుల్ గెటప్‌లో ‘ది ప్యారడైజ్’ విలన్.. ‘శికంజ మాలిక్’గా మోహన్‌బాబు అదిరిపోయాడుగా
The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న వైవిధ్యభరిత చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise)పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్‌బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొట్టాయి. తాజాగా, చిత్ర యూనిట్ ఆ ఊహాగానాలకు తెరదించుతూ, మోహన్‌బాబు లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది.
పోస్టర్ ప్రకారం, మోహన్‌బాబు ఇందులో ‘శికంజ మాలిక్’ అనే పవర్‌ఫుల్ పాత్రను పోషించనున్నారు. షర్ట్ లేకుండా, చేతిలో గన్, కత్తి పట్టుకుని, నోటిలో సిగార్‌తో ఆయన డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ప్రధాన విలన్‌గా నటించబోతున్నట్లు చిత్రబృందం ధృవీకరించింది. మోహన్‌బాబు సినీ కెరీర్‌లో ఇది మరో ఛాలెంజింగ్ రోల్ కానుందని తెలుస్తోంది.
ఇక కథానాయకుడు నాని కూడా ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. నాని పోషించే పాత్ర పేరు ‘జడల్’. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాల ప్రకారం, ఈ సినిమా తిరుగుబాటు (రెబలియన్), నాయకత్వ అంశాలతో పాటు తల్లీకొడుకుల అనుబంధం చుట్టూ తిరిగే కథాంశం ఇందులో కీలకంగా ఉండనుంది.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను ఒక భిన్నమైన కథాంశంతో, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ సహా మొత్తం 8 భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.
ఈ చిత్రంలో నాయిక ఎవరు అనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, యువ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, మరో ప్రముఖ నటి సోనాలి కులకర్ణి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత కెమెరామెన్ జి.కె.విష్ణు ఛాయాగ్రహణం అందించగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.
సికింద్రాబాద్ నేపథ్యంలో సాగె కథనంతో ఈ సినిమా రాబోతుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోందట. శ్రీకాంత్ ఓదెల రెండవగా వస్తున్న ది ప్యారడైజ్ తో నేచురల్ స్టార్ నానిని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో చూపిస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.