Morning Motivation:మేల్కొలుపు-11
ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్ కు వెళ్ళి ఇడ్లీ తింటాడు… కాఫీ తాగుతాడు…
కానీ …??
99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలు పెడుతున్నాడు.
మనం ఈరోజు లభించిన దానితో ఉన్నదానితో అనుభవించము… దానితో తృప్తిపడము
లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటాము..ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు..
దేహం ఓ వైపు లాగుతుంటే..మనసు మరోవైపు పోతుంటుంది
ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు, సంతృప్తి వుండదు..
సృష్టిలో మనిషి ఒక అద్భుతమైతే..
మానవతతో ఆ జన్మను సార్థకం చేసుకునే విధానాలతో, జీవయాత్ర సాగించడం, మానవ ధర్మం.
కలియుగంలో మసలే మనుషులు, చిత్ర విచిత్ర స్వభావాలతో ఎవరికి వారే, అన్నట్లు బ్రతుకుతూ..
ఎదుటి వారి గురించిన ఆలోచనలకు దూరమవడం వల్ల..
ఎన్నో అనర్థాలు ఎదురవుతున్నాయి.
ఒకే కుటుంబంలో నివసించేవారు సైతం
ఎవరు, ఏమిటి తమ నుండి ఏమి ఆశిస్తారో అనే భయాలతో
బాంధవ్యాలను విస్మరించడం విస్మయం కలిగించే విషయం.
కష్టసుఖాలతో, ఒకరినొకరు, ఉపకారాలతో తోడ్పాడుతో, ఐకమత్యంతో మెలగడం అరుదుగా మారింది.
మానవ సంబంధాలు అడుగంటడంతో ఆత్మీయతలు లేవు.
అసూయాద్వేషాలు, స్వార్థం ప్రకోపించి, మనుషుల మధ్య మాటలే కరువయ్యాయి
పలకరిస్తే పాపం అన్నట్లు..ఎవరికి వారు ఒంటరితనమే భాగ్యం అన్నట్లు ప్రవర్తిస్తూ ఉండటం వల్ల..మానసిక ప్రశాంతతను కోల్పోతూ, నిరుత్సాహం కొని తెచ్చుకుంటున్నారు.
ఎదుటివారి పట్ల కుతూహలమే తప్ప, ఎవరికి ఎలా ఉపయోగపడాలి..ఎలా సహాయం అందించాలి అనే ఉపకార బుద్ధిని కలిగి ఉండకుండా…
తమ వరకే అనేలా సంపదలను పెంచుకుంటూ..
వాటి సాధన కోసం ఎంత చెడుపనికైనా సిద్ధమవడం వల్ల ప్రయోజనాలు శూన్యం
ఒక ఇంట్లో కుటుంబసభ్యులు పరస్పరం ప్రేమను కలిగి ఉండకపోతే ఎన్ని విద్యుద్దీపాలు ఉన్నా వెలుతురు లేనట్లే..
జీవితంలో ఒక్కటే గుర్తు పెట్టు కోవాలి..
కన్న తల్లిని నమ్మిన నాన్నని..ప్రేమించిన మనిషిని తప్ప ఎవ్వరిని నమ్మకూడదు..
వాళ్ళు మాత్రమే నీ కష్టం లో తోడుంటారు
జీవితం ఆనందంగా గడపాలి అంటే…
రెండు సూత్రాలు పాటించాలి.
క్షమించలేని వాళ్ళని మరచిపోవాలి.
మరచి పోలేనివాళ్ళని క్షమించాలి.
అప్పుడే మనము ప్రశాంతముగా ఉంటాము…
శుభోదయం