Morning Motivation : మేల్కొలుపు – 3
అబద్ధాల్లో..అబద్ధాలతో..అబద్ధపు బతుకులు బతికే బతుకుల్లో..అబద్ధమొక్కటే తిరుగులేని సత్యం.
నీ జీవితం అమూల్యం..!!
నీకు విలువ ఇవ్వని వారికి అందులో క్షణం కూడా ఇవ్వకు.నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి..
సామాజిక అవగాహన,సామాజిక స్ఫూర్తి,సామాజిక చైతన్యం లేని వాళ్ళు…ఏది నిజమో…ఏది అబద్ధమో….తెలుసుకోలేని మూర్ఖులు..
మనం ఏది చేసినా..ఏది చెప్పినా..
ఒకడు అవును అంటాడు..!ఒకడు కాదు అంటాడు..
ఇదే నేటి లోకం తీరు..!!
క్యారెక్టర్ ఉన్నోడికి..కావాల్సినోళ్లంటూ ఎవరూ ఉండరు. వాడి బ్రతుక్కి వాడే రాజు, వాడే బంటు..
నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి..పొ గుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి.
కావాలనే నిందించే వారుంటారు..అలాగ..మీకు మంచి కావాలనే నిందించే వారు కూడా ఉంటారు.
ప్రతిఫలం కోసం పొగిడేవారుంటారు. పరుల హితం కోసం పొగిడే వారుంటారు..
ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే… మనలోని లోపాలను విశేషతలను అంతర్మథనం చేసుకుని పరిశీలించుకున్న రోజు…
పొగడ్తలు పరిచారికలుగా…. నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి..!!
“శుభోదయం”