Morning Motivation : మేల్కొలుపు -4
ఏదైనా ప్రతికూలంగా ఆలోచించకుండా సానుకూలంగా ఆలోచించడం లోనే అసలైన గెలుపు ఉంటుంది…
మరి ప్రతికూలం అంటే..??
మనం ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది..??
భయం
చెడు ఆలోచనల వల్ల, మన చుట్టూ చెడు ఆలోచనలు చేసే వ్యక్తులు ఉన్నా , మన పట్ల మనకి విశ్వాసం లేకపోయినా, అవగాహన లోపం వల్ల కూడా భయం ఏర్పడుతుంది.
అందుకే మన ఇంటిని రోజూ శుభ్రంగా వీలైతే సూర్యరశ్మి తగిలే విధంగా అందమైన పూల మొక్కలతో ఉంచుకోవాలి. ఇవన్నీ మనలో సానుకూల ఆలోచనలు కలిగిస్తాయి
చింత
నిరంతరం ఏదో ఒక దాని గురించి అదేపనిగా చింతిస్తూ ఉన్నా కూడా కిందకే అంటే అగాతం లోకి పడిపోతాం..
అందుకే చేసే పని లాభాపేక్ష ఆశించకుండా చేయాలి. మన పట్ల మనకి నమ్మకం ఉండాలి.
అనుమానం
ప్రతివారినీ ఏదోరకంగా అనుమానిస్తాం.. చివరికి ప్రాణ స్నేహితులని కూడా మంచివాడా కాదా అని? స్నేహితుడి పట్ల విశ్వాసం ఉండాలి. అలా విశ్వాసం లేకుండా ఉన్న కూడా ప్రతికూలంగా ఆలోచించినట్లే.
చెడు చెప్పేవాడు..చెడు మాట్లాడేవాడు
నెగటివ్ గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ మన గురించి చెడు మాట్లాడుతూనే ఉంటాడు.
ఆ విధంగా ఉన్నవాడే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాడు, మనం మాత్రం అలాంటి వారిపట్ల నిరంతరం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే ఆఆలోచనలే ఆ వ్యక్తికి మనం అంటే ఇష్టం పెరిగి మారతాడు
అవసరమైన దాని కన్నా ఎక్కువ కష్టపడటం
ఒక వ్యక్తి ఫలానా పని చేయలేకపోయినా దానిని చేస్తున్నాడంటే అతనికి గర్వం, అహంకారం ఉన్నట్టే..
నేనొక్కడినే ఆ పనిని చేస్తున్నానని చెప్తే వాడికి గర్వం ఉన్నట్లే.
అసూయ
మనల్ని వేరేవాళ్ళతో పోల్చుకుంటే.. మనం భూమ్మీదకి ఎందుకు వచ్చామో.. ఆ వచ్చిన దానికి అర్ధం లేకుండాపోతాం. అందుకే ఉన్న వాటితో తృప్తి పడాలి..
ఎవరైనా ఏదైనా సాధిస్తే, వారిని చూసి సంతోష పడడం నేర్చుకోవాలి, వారి నుండి స్ఫూర్తిని పొందాలి కానీ అసూయ పడొద్దు
ఇతరులను నిందించడం
మనలో ఏదైనా భాధ ఉంటే నే ఇతరుల్ని నిందిస్తాము, ముందు అదేమిటో తెలుసుకోవాలి.. ఆ లోపాన్ని సరిచేసుకుని, మారడానికి ప్రయత్నించాలి.
ప్రతికూలమైన ఆలోచనలకు బానిస అవడం
ప్రతీది నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తులు సమస్య ఏది లేకపోయినా సరే..వారే సృష్టించుకుని బాధపడుతుంటారు. అలా వారి మీద వారు ఎప్పుడూ జాలి పడుతూ నిరాశతో వుంటారు.
అసహనం
అసహనం వల్ల నిగ్రహం కోల్పోతారు.. ప్రతీ సందర్భంలో ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించండి..
ఇలా వీటన్నిటిని మనం గుర్తించాలి.. పైన చెప్పిన వాటిలో మనలో ఏ భావం ఉన్న మనం ప్రతికూలంగా ఉన్నట్లే…
“శుభోదయం”
