Morning Motivation:మేల్కొలుపు-13
ఆశ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది..
అత్యాశ,అధఃపాతాళానికి దారితీస్తుంది..
నిరాశ బతుకు మీద విరక్తిని పెంచుతుంది..
జీవితము నిన్నటి కన్నా మిన్నగా నేడు..
నేటి కన్నా మిన్నగా రేపు జీవించాలి.
జీవితంలో వాస్తవం ఉండాలి..
ఏం జరిగినా స్వీకరించే ధైర్యం ఉండాలి..
ఊహలు,ఆశలు కలలు నిజం కాదు..కానీ బాగుంటాయి
మన జీవితం మనమే డిజైన్ చేసుకోవాలి..
మనకు,ఇతరులకు ఇబ్బంది లేకుండా..మన తాత్కాలిక సంతోషాలకు కారణమయ్యే వారి కన్నా…
మన మానసిక ఆనందానికి ఎవరైతే ప్రధానము అనుకుంటామో….
వారితోనే కలిసి మెలిసి ఉండడం శ్రేయస్కరం.
అంటుకునే శక్తి అగ్గి పుల్లకు వున్నా కానీ….
అది మండాలి అంటే…ఒక చేయి వుండాలి.
అమోఘమైన శక్తి మనిషికి వున్నా అది ప్రపంచానికి కన బడాలి అంటే..
ఆ మనిషికి ఒక అవకాశం కావాలి.
ఒక్కసారి వెలిగించే చేయి దొరికితే అగ్గి పుల్ల చీకటిని పారద్రోలి నట్లు అవకాశం దొరికితే…
మనలోని శక్తి కూడా వెలుగులా అందరికీ గోచరిస్తుంది.
అగ్గిపుల్లకు కూడ మండే అవకాశం ఒక్కసారి వచ్చినట్లుగా…
మనకు కూడా అవకాశాలు ఓకే సారి వస్తాయి.
అవకాశం తలుపు తట్టినపుడు మనం మెలకువతో సద్వినియోగ పరచుకుంటే…
మన కన్నా అదృష్ట వంతులు ఎవరూ వుండరు..
శుభోదయం