Morning Motivation:మేల్కొలుపు-16
వెయ్యి బలమైన ఆలోచనలను…
ఒక్క బలహీనమైన ఆలోచన చెరిపేస్తుంది.
అందుకే ఎప్పుడూ మనల్ని మనం తక్కువగా ఆలోచించకూడదు..
నీ నమ్మకం నిన్ను నిలబడేలా చేస్తుంది..
నీపై నమ్మకం నీతో నిలబడేలా చేస్తుంది..
మనిషి పుట్టాక భయం పుట్టింది..
కానీ భయం పుట్టాక మనిషి పుట్టలే..
ప్రతి సమస్య కి ఓ సమాధానం ఉన్నట్టు…
భయానికి కూడా భరోసా ఉంటుంది.
నీకు కావలసినదానిగురించి…
నీకుతప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి పూర్తిగా తెలియదు.
చివరికి ఆ దేవుడికి కూడా..
అందుకే అడిగిన ప్రతీఒక్కడికి…సమాదానం చెప్పుకుంటూ రావడమనేది మార్చుకో.
జీవితంలో అనుకోకుండ కాంప్రమైస్ కాంప్రమైస్ అవ్వాల్సి వస్తే అది తలరాత అనుకోవాలి.
కాంప్రమైస్ అవ్వాలని నువ్వే అనేసుకుంటే అది చేతకాక అనుకోవాలి..
మాటకారిని నమ్మినట్టు…
చేసి చూపించే వారిని ఎప్పటికీ నమ్మదు ఈ లోకం..
మనకు ఈ జీవితం శాశ్వతం కాదు…
ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు
మనం జీవించే కొంత
కాలానికే ఎన్నో బాధలు..బంధాలు.. బాధ్యతలు…
ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము..
బతికే ఉంటే ఇంకా పోలేదా …అంటాం
రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు
పగలు , కక్షలు , పంతాలు ఎందుకు…..??
ఎవరూ ఉండి తినేది లేదు….
పోయి సాధించేది లేదు.
ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం
ఏ పనినైనా చేసే ముందు నిన్ను నీవు ప్రశ్నించుకో…
నువ్వు చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక వస్తుంది.
శుభోదయం