Morning Motivation :మేలుకొలుపు
గెలిచేవాడికైనా..ఓడేవాడికైనా ఉండేది 24 గంటలే..
కానీ…
గెలిచేవాడు 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు..
ఓడేవాడు 24 గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు…
తెలివిగా మాట్లాడడమో.. నోరు మూసుకొని కూర్చోవడమో..
ఏదో ఒకటి తెలిసుండాలి.
ప్రతి రోజు సూర్యుడు ఉదయిస్తాడు ఇది సత్యం.
అలాగే నువ్వు ఎదగటానికి కూడా అవకాశాలు వస్తుంటాయి.
వాటిని పట్టుకుంటావో వదిలేస్తావో అనేది నీ ఇంగితం బట్టి ఉంటుంది.
ఉపయోగించుకోవడానికి ప్రయత్నించు…
అదృష్టం అనేది రోజూ రాదు…
అది వచ్చేవరకూ ఊరుకోకుండా నువ్వు ఏదో ఒక ప్రయత్నం కొనసాగించటమే నీ ముందున్న కర్తవ్యం
నీ కష్టానికి ప్రతిఫలం..అదృష్టం రూపంలో అప్పుడు వస్తుంది.
ఒక్కోసారి కోల్పోయిన దానిని తిరిగి పొందటం కూడా కష్టమే..
అది మనిషి అయినా వస్తువు అయినా..
మనిషి చుట్టూ మంచి చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి..
దేన్ని వదిలేస్తాం దేన్ని తీసుకుంటాం అన్నదాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది.
మంచిని అభినందించే లక్షణమున్న వారికి మనసు హాయిగా ఉంటుంది.
సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయం అవుతుంది .
పనికిరాని వస్తువులు ఇంటికి బరువు..
పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు..
పరులసొమ్ము ఆశించేవాడు భూమికి బరువు…
మనకి ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు..
మనకి ఉన్నదాంతో మనమెంత సుఖంగా, సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం…
తృప్తి పేదోన్ని కూడా ఆనందంగా ఉంచుతుంది..
అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది.
తగిలిన ప్రతీ గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ.
తగిలిన ప్రతీ గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు.
ఎందుకంటే..??
ముళ్ళుని తొక్కిన కాలుతో బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు…
మరోసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి.
నిన్నటి గురించి భయపడే వాడు నేడు పోరాడలేడు..
నేడు పోరాడలేని వాడు రేపు గెలువ లేడు..
గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి..
భయం పోవాలి అంటే పోరాడి తీరాలి..
భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలుఅవుతుంది..
నీలో ఉన్న భయం నిన్ను అధమ స్థాయిలో పడేస్తుంది..
కానీ….
నీమీద నీకు ఉన్న నమ్మకం నిన్ను గొప్ప స్థాయికి చేరుస్తుంది..
భయం వదిలి పోరాడితే విజయం నీ బానిస అవుతుంది..
నమ్మకం ఉండాలి..
కానీ..
ఎక్కడ ఎప్పుడు తగ్గాలో..
ఎప్పుడు ముందుకు వెళ్ళాలో..
మెలుకువలు, జ్ఞానం తెలిసి ఉండాలి.
అలా అయితేనే…. విజయం సాధించవచ్చు..
లేకపోతే
కష్టాలు కొనితెచ్చుకొనే అవకాశం ఉంటుంది..
నిజాయితీగా ఉండడం కూడా ఓ యుద్దం లాంటిదే..
యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో…
సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం..
మనిషికి కత్తి ఇచ్చి వీరున్ని చేయవచ్చు..
పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయవచ్చు..
కానీ…
మంచివాడు కావాలంటే మాత్రం..మంచి మనసు ఉండాలి తప్ప..అది మనం ఇవ్వలేం..
నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది..
అదే వేరొకరి పై వుంచితే అది మీ బలహీనత అవుతుంది..
“శుభోదయం”