Morning Motivation: మేల్కొలుపు – 8
క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆటగాళ్లకు ఎంపైర్ ఏమీ చేయడు.
సిక్స్ ఐతే సిక్స్, అవుట్ అయితే అవుట్ అని చెప్తాడు..
జీవితమనే ఆట లో…మన ఆట కి ఎవరు సహాయం చేయరు, మన ఆట మనమే ఆడాలి…
మనమాటే మన సంపదలకు మూలం.
ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం.
మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి…
ఆ మాటలే మనకు శత్రువుల్ని కూడా తయారు చేస్తాయి.
ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది.
కానీ…
మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు.
ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు.
ఒకసారి ఓపిక పట్టు చూడు..
నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది.
సాధించాలనే తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది.
ఏ వస్తువైనా…బంధమైనా..రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది.
ఒకటి దొరికినప్పుడు..
రెండోది
పోగొట్టుకున్నప్పుడు…
ఎందుకంటే..??
ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.
లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు.
చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు వస్తుంటాయి.
అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా..కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి..పోతుంటాయి.
ఇక్కడ మనం నేర్చుకోవలసింది..తడబడడం కాదు, నిలబడడం..
అప్పుడే మనం అనుకున్నది సాధించగలం.
“శుభోదయం”