Morning Motivation:మేల్కొలుపు-10
నీ అంతఃర్ముఖానికీ ఎన్ని ముసుగులు వేసినా…
ఏదో ఒకరోజు నీ అసలైన అంతఃర్ముఖం బయటపడుట తథ్యం .
అందుకే ఏ ముసుగులు లేకుండా ఉండడానికి ప్రయత్నించు…
నీ అంతఃర్ముఖానికీ ముసుగులు వేయకు.
మనిషికి వయసు హోదా పెరిగే కొద్ది అనుభవం పెరగాలి..
ఆలోచనా విధానం మారాలి
ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి
అప్పుడే మనిషికి విలువ అయినా గౌరవం అయినా…
నీలోని మంచిని సమాజానికి పంచు
నీలోని చెడుని నీలోనే త్యజించు
సమాజహితమే నీ హితం కావాలి
మార్పు రావాలని కోరుకుందాం
అందరికీ మంచి జరగాలని కోరుకుందాం
మార్పే రావాలి..మంచే జరగాలి..
మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు
బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు
శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు.
ఒక చిరు నవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది.
క్షణికమైన కోపం అయిన వారిని కూడా దూరం చేస్తుంది.
ఈ చిన్న జీవిత కాలంలో అందరికీ మన ప్రేమను పంచుతూ అందరి అభిమానానికి పాత్రులమవుదాం
