MORNING MOTIVATIONS:మేల్కొలుపు -5
మనం కళ్ళతో చూసేది..విన్నది… చదివేది..అలాగే ఎదుటివారు చెప్పేదల్లా సత్యం అయితే ఈ ప్రపంచం ఏ నాడో బాగుపడేది.
ప్రతీ ఘోరం వెనుక ఒక అసలైన కథ వేరే ఉంటుంది..
అది ప్రపంచానికి తెలియదు..
ఆ అసలైన వారికి తప్ప..
మనుషులను అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది.
ఎప్పుడు, ఎలా మారుతారో ఎవరూ… ఊహించలేము..
కత్తి పదును పెరగాలంటే గరకు తలంతోనే రాపిడి చెయ్యాలి .
అలానే ఆలోచనల పదును పెరగాలంటే…
మూర్ఖులతోనే వాదించాలి
సమ వుజ్జీలతో మాట్లాడాలి
మేధావులతో చర్చించాలి
రాజకీయాలతో ఆడుకోవాలి.
స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం
ఎవరికోసం ఆగదు…..మనమే దాన్ని ఆపాలి
వేరే వాళ్ల గురించి ఆలోచించవద్దు.
వాళ్లు నీకన్నా గొప్పోళ్ళు కాదు…ఖచ్చితంగా
వంద సమస్యలు వేధిస్తున్నా
గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికి సమాదానం చెప్పగలదు…..
శుభోదయం