Morning Motivations: మేల్కొలుపు – 6
నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్
జీవితం శాశ్వతం కాదు..ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు.
జీవించే కొంత కాలానికి ఎన్నో బాధలు బంధాలు, బాధ్యతలు.
ఎవరైనా చనిపోతే “అయ్యో పాపం పోయాడు” అంటాం.
బతికి ఉంటే “ఇంకా పోలేదే” అని కూడా అంటాం ఒక్కోసారి .
ఏదేమైనా మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అనేదే నిజం
అందుకే మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గడిచిపోయినా గతాన్ని గురించి తక్కువగా ఆలోచించు.
రాబోయే భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు.
ప్రపంచంలో దేని గురించి అయినా తెలుసుకోవచ్చు..కానీ
“ఆత్మ” గురించి మాత్రం ఎవరూ తెలుసుకోలేరు.
అసలు ‘అది’ తప్ప వేరే ఏమీ లేదు అన్న ఆలోచన.. గుర్తు ఉంటే చాలు.
“నా జీవితానికి ఏమి తక్కువైంది” అని సంతోషంగా బ్రతికి చూడండి..
జీవితం ఎంతో బాగుంటుంది.
మనకన్నా కొన్ని వేలమంది బాగుండవచ్చు.. కానీ
కొన్ని కోట్లమంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు.
సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి…అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది.
అందాన్ని పెంచుకుంటే కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు.
ఆస్తిని పెంచుకుంటే గంధపు చెక్కల్లో తగలపెడతారు.
పేరుని పెంచుకుంటే సన్మాన పత్రాలతో.. అవార్డులతో సత్కరిస్తారు.
హోదాని పెంచుకుంటే ఇంతెత్తు హోర్డింగ్ లో నిలబెడతారు.
అదే “వ్యక్తిత్వాన్ని” పెంచుకుంటే…జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు.
ఎదుటివారి తప్పోప్పులు నవ్వుతూ భరిoచినంత కాలం మనం మంచివాళ్ళమే…
ఎప్పుడైతే తప్పును “తప్పు” అని చెప్పి సరిచేయాలని చూస్తామో…
అప్పుడే మనలో మనకి తెలియని “లోపాలను” వెతికి మరీ ప్రపంచానికిమరో రకంగా పరిచయం చేస్తారు.
అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్ని మరుగున
పడిపోతాయి.
ఇదే నేటి కొందరు…బందువుల, మనుషుల నైజం.. తీరు