Movie Reviews : నిజానికి సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్.. సినిమా నవరసాలను మనకు అందించి.. రెండున్నర గంటల సేపు మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అయితే.. జ్యోతిష్యం ద్వారా మనిషి భవిష్యత్తు చెప్పినట్టు, రివ్యూల ద్వారా సినిమా భవిష్యత్తును చెప్పేస్తున్నారు. సినిమా కథ ఎలా ఉన్నా కూడా ఈ మధ్య రివ్యూల రూపంలో ఆ కథ హిట్ హ.. పట్టా హ.. అనే విషయాన్ని చెప్పేయడం బాగా ట్రెండీ అయిపోయింది. ఒకప్పుడు సినిమా విశ్లేషకులు ఒక వారం తర్వాత సినిమా మీద తమ అభిప్రాయాన్ని చెప్పేవారు.
కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పాత పద్ధతుల ప్లేస్ లో కొత్త విధానాలు వచ్చి చేరాయి. రోజులు ఎలా మారిపోయాయి అంటే..? ఇప్పుడు అన్ని అంశాలు సోషల్ మీడియా పైనే ఆధారపడి ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా.. సినిమా ఇండస్ట్రీలో మూవీ అప్డేట్స్ , గాసిప్స్, రూమర్స్ ఇలా ఏ టాపిక్ అయినా కూడా నిజానిజాలు పక్కన పెడితే, సోషల్ మీడియాలో ఏ న్యూస్ అయితే వైరల్ అవుతుందో.. అదే నిజమని నమ్మే స్టేజ్ లోకి జనాలు వెళ్లిపోయారు.
వీటిల్లో సినిమాలపై వచ్చే రివ్యూస్ ముఖ్యమైనవి.. నిజంగా ఇవి ఎంత ఫన్నీగా ఉంటాయి అంటే.. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే, ఆ సినిమా ఫ్యూచర్ ఏంటో చెప్పేస్తు.. ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. ఈ రివ్యూలాల్లో మళ్ళీ వేరియేషన్స్ కూడా ఉన్నాయండోయ్. వినే మనకు ఈ విషయం కొంచెం విచిత్రంగానే ఉంటుంది.
సినిమా రివ్యూ నీ చెప్పడానికి చాలా ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మెయిన్ గా సోషల్ మీడియా, ట్విట్టర్ , యూట్యూబ్ లలో కొన్ని గంటల్లోనే ఆ సినిమా యొక్క భవిష్యత్తు ఏమిటి అనేది తేల్చేస్తున్నారు. ఆ రివ్యూలను బట్టే ఆ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు ప్రేక్షకులు.
ఒక్కోసారి మంచి స్టోరీ ఉన్న సినిమాలు కూడా ఈ రివ్యూల దెబ్బకి ఫ్లాప్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి ఇక ఈ రివ్యూలు ఏ రేంజ్ లో ఉంటాయో మీకు అర్థం అయే ఉంటుంది… ఒకోసారి సినిమాకు హైప్ పెంచేసి రివ్యూ ఉండడంతో అంతంతమాత్రంగా ఉన్న సినిమాలు కూడా బాగా ఆడేస్తున్నాయి.
సినిమా విజయం రివ్యూల రూపంలో దాగి ఉందనీ… కథ, కథనం పక్కదారి పట్టిపోయాయి అనీ మనకు అర్థం అవుతుంది. దీనివల్ల ప్రొడ్యూసర్స్ తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. సినిమాల రివ్యూ కి సంబంధించి కేరళ హైకోర్టు ఒక సంచలన తీర్పును ఇచ్చింది.
కేరళలోని ముబిన్ రూయఫ్ అనే డైరెక్టర్ ” ఓ రొమాలింటే అద్యతే ప్రాణయం ” సినిమా కోసం హైకోర్ట్ ని ఆశ్రయించారు. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత వరకు సినిమాపై ఎటువంటి రివ్యూస్ రాకూడదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు మామూలుగా లేదు. తప్పుడు రివ్యూలు రాసేవారికి ఈ తీర్పు చెంపపెట్టు అనే చెప్పవచ్చు.
కేరళ హైకోర్టు, కేరళ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉన్న రివ్యూలపై ప్రత్యేకమైన దృష్టిని సారించి ,తప్పుడు రివ్యూస్ రాసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించింది. ఒక సినిమాపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం తప్పు కాదు, నిర్మాణాత్మక విమర్శలు తప్పుకాదు,
కానీ అతి విమర్శలు చేస్తే మాత్రం దానికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని కేరళ కోర్టు హెచ్చరించింది. దీంతో ఇప్పుడు సినిమా రివ్యూస్ వైరల్ అయినట్టుగానే.. ఈ న్యూస్ కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పనిగట్టుకొని తప్పుడు రివ్యూస్ ని ప్రచారం చేసే వారికి ఇదొక గుణపాఠం అనుకోవచ్చు.