MP Fire on Pushpa and Animal Movies : పుష్ప, యానిమల్, కబీర్ సింగ్ సినిమాల గురించి కొత్త చర్చ మొదలైంది. చత్తిస్ ఘడ్ కు చెందిన ఎంపీ రంజిత్ రంజన్ రాజ్యసభలో ఈ సినిమాల గురించి ప్రస్తావించారు. ఈ సినిమాల మీద ఆమె చాలా ప్రశ్నలను రాజ్యసభలో వినిపించారు. ఇప్పుడు ఈ టాపిక్ చాలా ట్రెండింగ్ లో ఉంది. అలాగే చాలా చర్చకు కూడా దారితీస్తుంది.
ఈ సినిమాలలో హీరోలను చాలా విపరీత ప్రవర్తనతో చూపించారని అలాగే ఆడవాళ్ళ పట్ల చాలా అనైతిక ప్రవర్తనను ప్రేరేపించే విధంగా కూడా హీరో ఇజం ఉందని దీనివల్ల సమాజంలో యువత ఆలోచనలు పెడదారి పట్టే అవకాశం ఉందని ఆమె వాదించారు. ఇప్పుడు ఈ వ్యాక్యాలు కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తమ హీరోలకు సంబంధించి ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది సమాజం పైన సినిమాల ప్రభావం కూడా ఉంటుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు వాదన మరోరకంగా ఉంది. ఆ మధ్య అపరిచితుడు, భారతీయుడు సినిమాలో వచ్చాయి. దానివల్ల ఎంతమంది లంచం తీసుకోకుండా ప్రవర్తించారు.
అలాగే పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా చూపించారు. అలాగని అందరూ స్మగ్లింగ్ చేస్తారని అనుకోవాలా.. చాలా సినిమాలలో ఇలాంటివి ఏదో ఒక టాపిక్ ఉంటూనే ఉంటుంది. అలాగని ప్రజానీకం అంత దాన్నే పట్టుకుని ఆ రకంగా ప్రవర్తిస్తానని సమంజసం కాదని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, మరి
కొంతమంది చాలా వరకు యువత సినిమాలలో హీరోయిజం ఫాలో అవుతుంటారని, కాస్త చెడు ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి సినిమాలతో మంచి, చెడు రెండు ముడి వేయడం కరెక్ట్ కాదు. ఎవరి సొంత ఆలోచనలు వారికి ఉంటాయి అని ఇంకొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ కామెంట్స్ ఏంటో తప్పకుండా తెలియజేయండి.