Mrunal Thakur: మృణాల్ ఠాకూరే నేషనల్ క్రష్, రష్మిక మందన్నా కాదు..: బాలీవుడ్ నటుడి కామెంట్స్ వైరల్
Mrunal Thakur: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో దూసుకుపోతున్న నటి రష్మిక మందన్నకు ‘నేషనల్ క్రష్’ అనే ట్యాగ్ పేరు స్థిరపడింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె అభిమానులు, సినీ వర్గాలు ఇదే పేరుతో రష్మికను పిలుస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ట్యాగ్‌పై మరో నటి మృణాల్ ఠాకూర్ అభిమానులు కూడా పోటీ పడుతున్నారు. తమ అభిమాన నటినే అసలైన ‘నేషనల్ క్రష్’ అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెర లేపారు.
ఈ వివాదం ఇటీవల ఒక బాలీవుడ్ నటుడు చేసిన వ్యాఖ్యలతో మరింత ఊపందుకుంది. బాలీవుడ్ నటుడు అవినాష్ తివారీ ఒక ఇంటర్వ్యూలో ‘నేషనల్ క్రష్’ ఎవరు అని అడిగిన ప్రశ్నకు, “ప్రస్తుత హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఆ పదానికి సరిగ్గా సరిపోతుంది, ఆమె ఆ ట్యాగ్‌కు అర్హురాలు” అని వ్యాఖ్యానించారు. అవినాష్ చేసిన ఈ కామెంట్లు మృణాల్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచగా, రష్మిక అభిమానులు వాటిని ఖండిస్తూ మండిపడుతున్నారు.
‘సీతారామం’ వంటి చిత్రాలతో తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న మృణాల్, ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి దశలో ఉన్నారు. అన్ని భాషల్లోనూ నటిస్తూ గ్లామర్, నటనతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు ‘రియల్ నేషనల్ క్రష్’ మృణాల్ ఠాకూర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్‌ల అభిమానుల మధ్య ఈ ‘నేషనల్ క్రష్’ ట్యాగ్ ఒక వివాదాంశంగా మారేలా ఉంది.
కాగా.. రష్మిక మందన నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘థామ’కు సంబంధించిన అధికారిక టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్న ఈ సినిమా,..ఒక సోషల్ థ్రిల్లర్‌గా రూపొందినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. టీజర్‌లో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా మధ్య ఆసక్తికరమైన సంభాషణలు, కథలోని ఉత్కంఠభరితమైన అంశాలు కనిపిస్తున్నాయి. రష్మిక మందన్నా నటన, ఆమె హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆయుష్మాన్ ఖురానా తనదైన శైలిలో హాస్యాన్ని పండించడంతో పాటు కథలో ఉన్న సీరియస్‌నెస్‌ను కూడా పర్ఫెక్ట్‌గా చూపించారు. దర్శకుడు విక్రమ్ మల్హోత్రా ఈ కథను చాలా వాస్తవికంగా.. అదే సమయంలో ఆసక్తికరంగా తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తోంది.