Nadendla in Christmas Celebrations : శనివారం సాయంత్రం తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మనోహర్ గారు సతీసమేతంగా పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలసి కేక్ కట్ చేశారు. క్రైస్తవ, సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియచేశారు.
సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, ప్రతి మానవుడి కోసం ఏసు క్రీస్తు ఎలా నిలబడ్డారో అలాగే తాము కూడా అండగా నిలబడతామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రతి మానవుడిలో ప్రేమ, క్షమాగుణం అలవడాలన్న క్రీస్తు ఆలోచనా విధానం నిత్య ఆచరణీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవ జనులు బిషప్ లు ప్రత్యేక ప్రార్ధనలు జరిపి, బైబిల్ సందేశాన్ని అందించారు. మనోహర్ గారి దంపతులకు క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వచనాలు అందచేశారు. ఈ సందర్భంగా మనోహర్ గారు మాట్లాడుతూ.. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నడం సంతోషకరం. పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయం కాదు.
సామాన్యులు సమస్యలు చెప్పుకోనే వేదిక. పదవి అలంకరణ కాదు, ఇబ్బందుల్లో ఉండే ప్రజల కోసం అని భావించిన నాడే సుపరిపాలన అందచేయగలం. ప్రభుత్వంలో ఉండే పెద్దలు, రాజకీయ నాయకులు కూడా అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూడాలి. మనం నడిచే బాట ఎవరికీ అన్యాయం చేయకుండా ఓ మార్పు కోసం నిలబడిన నాడు ప్రతి రోజు ప్రజలకు పండుగ రోజు అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.