Nadendla Manohar – Guntur : గుంటూరు మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నాయకుడు తప్పులు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా చేయాలి అనే భావన వైసీపీ నాయకులది. అధికార అహంకారంతో వారు చేస్తున్న వ్యాఖ్యలు, చేష్టలు కచ్చితంగా నేరం చేసినట్లే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై హిట్ ఆఫ్ స్పీచ్ కింద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
గౌరవ మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి జనసేన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిలా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వెంటనే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలి. లేకుంటే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తానుని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు.
దేశంలో చట్టం అందరికీ సమానమే. ఎవరు తప్పు చేసినా ఒక్కటి, అధికారంలో ఉన్నవారికి ఒకలా, లేనివారికి మరోలా చట్టం పని చేయకూడదు. చట్టాన్ని కాపాడ పోలీసులు కచ్చితంగా ఈ విషయంలో తారతమ్యాలు చూపకూడదు. పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ శాంతియుతంగా నిరసన తెలిపిందుకు వెళుతున్న జనసేన నాయకులను పోలీసులు నిన్న అర్ధరాత్రి నుంచి అడ్డుకున్నారు జిల్లావ్యాప్తంగా 350మంది జనసేన నాయకులను అరెస్టు చేశారు. దీనిని జనసేన ఖండిస్తుంది అన్నారు.