Nadendla Manohar : జనసేన పార్టీ ప్రజల గురించి, పార్టీ కార్యకర్తల గురించి ఆలోచించడంలో ముందు వరసలో ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందునుండి ప్రజా సమస్యల పైన వెంటనే స్పందింస్తూ ఉంటారు. అలాగే పార్టీలో క్రియాశీలకంగా పని చేసేటటువంటి కార్యకర్తలకి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన వెంటనే స్పందించి, వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి కావలసిన సహాయ, సహకారాలు అందిస్తూ ఉంటారు.
అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడినప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోని సందర్భంలో, పవన్ కళ్యాణ్ వెంటనే వారి దగ్గరికి వెళ్లి వారి గోడును విని, వారికి అందుబాటులో ఉన్నారు. అత్యవసర పరిస్థితులలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోయినప్పటికీ, పార్టీ నాయకులను సమస్య
ఉన్న ప్రదేశానికి పంపి ప్రజలకు తోడుగా ఉండమని ఆదేశాలను ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన పలువురు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, వేర్వేరు ప్రమాదాల్లో గాయపడ్డారు. వారిని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించారు. వీరికి వైద్య ఖర్చులకి సంబంధించి బీమా చెక్కులను అందచేశారు.
ఆ తరువాత కాజీపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు గద్దె వెంకట సత్యనారాయణ ఇటీవల ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను పరామర్శించి, వైద్య ఖర్చులకి సంబంధించి రూ.50 వేల భీమా చెక్కు అందించి. వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.