Nadendla Manohar : జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడూ అలజడులు జరగాలి… అశాంతితో ప్రజలు ఉండాలన్నదే జగన్ లక్ష్యం. అతడికి ఎల్లపుడూ అధికారం కోసం. చేసి కుట్రలు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ప్రజలకు మేలు చేయాలనే దృష్టి లేని నాయకుడు జగన్. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి, శాసనసభ్యులతో విడతలవారీగా రాజీనామాలు చేయించి, అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూశాడని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ప్రజల కోసం పని చేసేది ప్రజాస్వామ్యం. అనేక సందర్భాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు నిజాయతీగా స్పందించే నాయకుడు ఉండాలి. ప్రజలు సైతం ప్రభుత్వంలో పాలుపంచుకోవాలి. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అందుకు భిన్నమైన పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. గత నాలుగున్నర ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న వెతలు వర్ణనాతీతం. మన ప్రాంత, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రజలకు మేలు జరగాలి అని నిజమైన నాయకులు తపనపడతారు.
ఈ ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టి, అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 151 స్థానాలు అందించిన వైసీపీకి రాష్ట్ర సంక్షేమం పట్టలేదు. జనసేన పార్టీ ప్రస్థానం సుస్థిరమైన అభివృద్ధి కోసం, కొత్త విధానంతో, ఏ పార్టీ చేయని విధంగా ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి. అంచెలంచెలుగా జనసేనలో నా ప్రయాణం ఫ్రీ పవన్ కళ్యాణ్ గారితో 5 సంవత్సరాలు పూర్తయింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం ఎలా అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నాను అన్నారు.