Nadendla Manohar : తెనాలిలో జనసేన పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నమ్మి ఓటు వేస్తే ప్రజలకు కరెంట్ షాకులు కొట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం. సంక్షేమం పేరుతో డబ్బులు ఇచ్చి అంతకు రెట్టింపు ముక్కుపిండి ప్రభుత్వం వసూలు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు 35 శాతం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతుల వద్ద నుంచి లంచాలు తీసుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే చెందింది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. వైసీపీ పాలనకు చరమ గీతం పాడే సమయం వచ్చింది. తెనాలి నియోజక వర్గం అభివృద్ధికి అందరిని కలుపుకుపోతాం. తెనాలికి పునర్ వైభవం తెచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తాము అని నాదేండ్ల వెల్లడించారు. ఈ ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ప్రజలను కలవడు ,సమస్యలు తెలుసుకోడు, కేవలం హెలికాప్టర్ లో వస్తాడు, పరదాల మాటున పర్యటన చేసి వెళ్ళిపోతాడు.
ప్రజలు నమ్మి ఓటు వేసినందుకు వారిని అధిక కరెంటు చార్జీల పేరుతో తీవ్ర ఇబ్బందుల గురిచేస్తూ, మోసం చేస్తున్నారని నాదెండ్ల ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల సమస్యలు తీర్చమని దగ్గరికి వస్తే, వారి ఇంటి మీద, పట్టా పాస్ పుస్తకాల మీద, సర్వే రాళ్ల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలు అతికిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. ఒక వ్యక్తి వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న గొప్ప ముఖ్యమంత్రి ఈయన అని ప్రభుత్వ తీరునీ నాదెండ్ల విమర్శించారు. వైసిపి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతుల దగ్గర లంచాలు డిమాండ్ చేస్తుంది. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి పన్నుల పేరుతో రెండు చేతులతో ఈ ప్రభుత్వం ప్రజల నుండి లాగేసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య రెట్టింపు అవ్వడమే కాకా..
గతంలో ఇద్దరు ఆడపిల్లలు పుడితే లక్ష రూపాయలు ఇచ్చే పథకం అమలులో ఉండేది. దానికి అప్పట్లోనే బాండ్లు తయారు చేసి లబ్దిదారులకు ఇచ్చాం. మహిళలు దాచుకున్న సొమ్ముకే, ప్రభుత్వం మరికాస్త జోడించి ఆ డబ్బులు పిల్లల ఖాతాలో వేసిది. ఇటీవల మెచ్యూర్ అయిన బాండ్లకు డబ్బులు ఇవ్వమని అడిగితే అలాంటి పథకం ఏది లేదని ప్రభుత్వం చెబుతోంది.
అంత గొప్ప పథకాన్ని ప్రభుత్వం ఎవరికి తెలియకుండానే ఆపేసింది అని ఆయన అన్నారు. జనసేన పార్టీకి వ్యక్తిగతంగా ఎవరి మీద కోపంగాని, ద్వేషంగాని లేవు మేము ప్రజల కోసం పనిచేస్తాము. దాని కోసము అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాము అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్త కార్యకర్తలు జనసేన పార్టీలోకి భారీగా చేరికయ్యారు.