Nadendla Manohar : జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో రైతుల్ని పరామర్శించి,పంట స్థితిని పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు .ముఖ్యమంత్రి రాజసౌధం వీడి బయటికి రావాలి అనీ,
రైతుల్ని ఆదుకునే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఒకవైపు అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయి దీనస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ కు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అకాల వర్షాలకు అన్ని జిల్లాల రైతులూ నష్టపోయారు, మూడేళ్లుగా రైతులు నష్టపోతున్నా కూడా ప్రభుత్వం గాఢ నిద్రలోనే ఉంది.

రైతులకు భరోసా కల్పించడంలో యంత్రాంగం విఫలం అయింది. ఈ ప్రభుత్వం పేటీఎం బ్యాచ్, ఫోన్ పే బ్యాచ్ గా మారి రైతుని దోచుకుంటోంది. అనీ ప్రభుత్వం పైన మనోహర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనా పార్టీగా మేము పొత్తుల వ్యవహారంలో పారదర్శకంగా ముందుకు వెళ్తాం. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ముందడుగు వేస్తాము.
ప్రజల సమస్యలను మా సమస్యలుగా మేము భావించి, ఆ దిశగా మా కార్యచరణ సాగిస్తాము. అధికారం చేతిలో ఉన్నప్పటికీ రైతుల, ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాన్ని గద్దె దింపడమే మా ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు వెళ్తాము. అని నాదేండ్ల మనోహర్ గారు వెల్లడించారు.
