Nadendla Manohar – Tele Conference : సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాలు, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జులు, నగర అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ గారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐదు అంశాలతో కూడిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి జనసైనికుడు, వీర మహిళ పాలు పంచుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు ఒకే సమయంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ మంగళగిరి కార్యాలయం వేదికగా నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో తాను స్వయంగా పాల్గొననున్నట్టు మనోవార్ గారు తెలిపారు.
పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ప్రకటన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రతి అడుగు ప్రజాక్షేమం కోసమే వేస్తారు. ప్రతి కార్యకర్త తోటి వారికి సాయపడాలన్న అత్యున్నత లక్ష్యంతో ప్రయాణం సాగిస్తారు. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి మంచి చేసే విధంగా, ఆయన మనసుకు నచ్చే విధంగా ఐదు అంశాలతో కూడిన కార్యక్రమాలకు రూపకల్పన చేశామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణంలో గుర్తించిన అంశాల ఆధారంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించాము. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు, ఢిల్లీ, కాలనీలు సందర్శించి వారి మధ్య పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు వారికి నూతన వస్త్రాలు, భోజన ఏర్పాట్లు లాంటివి చేయడం, రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహణ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సందర్శించి విద్యార్ధులకు
పుస్తకాలు, స్టేషనరీ అందచేయడం, దివ్యాంగులకు సహాయం చేసే కార్యక్రమాలు చేపట్టండి. ఈ ఐదు అంశాలు పవన్ కళ్యాణ్ గారికి నచ్చే కార్యక్రమాలు, బైకు ర్యాలీలు, కేకు కటింగులకు సమయం వృదా చేయకుండా ఐదు అంశాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరపున నిర్వహించే ఈ కార్యక్రమాలు పది మందికి తెలిసే విధంగా ముందుకు తీసుకువెళ్లాం.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కార్యక్రమాల వివరాలు ఫోటోలు, వీడియోల రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. ఓ ప్రత్యేక హ్యష్ ట్యాగ్ ద్వారా ఈ కార్యక్రమాలపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిద్దాం అని తెలిపారు.