Naga Shaurya: కృష్ణ వ్రింద విహారి, వరుడు కావలెను వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఇటీవలే ఓ ఇంటివాడైన శౌర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగశౌర్య నటించిన PAPA సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా SLVC ప్రొడక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా శౌర్య రోడ్డుపై గొడవపడుతూ వార్తల్లో నిలిచాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. రోడ్డు పై ఇద్దరు లవర్స్ గొడవపడుతున్నారు.
ఇంతలో ఆ యువకుడు ఆ అమ్మాయి పై చేయి చేసుకున్నాడు. అటుగా వెళ్తోన్న నాగశౌర్య అది చూశాడు. వెంటనే కారు ఆపి దిగి వచ్చి ఆ యువకుడిని నిలదీశాడు. రోడ్డుపై అమ్మాయి మీద చేయి చేసుకుంటావా.. వెంటనే ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆ యువకుడు మాట వినకుండా ఆమె నా లవర్ అంటూ దురుసుగా ప్రవర్తించాడు.
నీ లవర్ అయితే మాత్రం రోడ్డు మీద అమ్మాయిని కొడతావా అంటూ నాగశౌర్య ఆ యువకుడిని నిలదీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శౌర్య చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. ఒక అమ్మాయిని కొడుతున్నారని కారు ఆపి గొడవకు దిగావంటే నువ్వు గ్రేట్ శౌర్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నాగశౌర్యను రియల్ హీరో అని పొగుడుతున్నారు.
https://www.youtube.com/shorts/3-Fq8IcwjV8?feature=share