Nagababu Comments on RGV : నువ్ కమెడియన్ రా వర్మా.. RGV పై నాగబాబు సెటైర్లు..
దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఫేస్బుక్ వేదికగా సెటైర్లు వేసారు మెగా బ్రదర్ నాగబాబు. కమెడియన్ గాడివి.. నీకు ప్రాణహాని ఎవడు చేస్తాడు రా అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నారు. అయితే అమరావతి ఉద్యమ నేత కొటికలపూడి శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్జీవి సమాజానికి చేటుగా మారాడని అతడి తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన RGV ఏపీ డీజీపీ ని కలిసి ఫిర్యాదు చేశారు.
List of Landidates of Janasena : జనసేన అభ్యర్థుల లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడినుండి అంటే..
ఇప్పుడు దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ..RGV గారి పై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. RGV గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను.. ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్ లో… ఆ మాటకొస్తే ఇండియా లో.. ఏ పనికిమాలిన ఎధవ మీకెటువంటి హాని తలపెట్టడు.. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చం*పడు కదా మీరేం వర్రీ అవకండి.. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు అంటూ పోస్ట్ చేసారు..