Nagababu : ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులకు, వీర మహిళలకు సమన్వయకర్తలుగా శశిధర్ కొలికొండ, రాజేష్ మల్లాను నియమిస్తున్నట్టుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. శశిధర్ నీ రాజేష్ ను నియమించడం మాకెంతో సంతోషంగా ఉంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అనుమతితోనే నిర్ణయం తీసుకున్నట్టుగా నాగబాబు గారు తెలిపారు.
సమన్వయకర్తలుగా ఎన్నిక కాబడ్డ ఈ ఇరువురు ఆస్ట్రేలియా జనసేన ఎన్.ఆర్.ఐ. కమిటీల నియామకం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు అనీ నాగబాబు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో జనసేన పార్టీ కార్యకలాపాలకు సంబంధించి వీరిద్దరు సమన్వయంతో పనిచేస్తారని నాగబాబు ఆశా భావం వ్యక్తం చేసారు.
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, ఆయా కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికీ నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు జనసేన పార్టీ పట్ల కనబరుస్తున్న ఆదరణ మరువలేనిదనీ.
అధిక సంఖ్యలో హాజరైన జన సైనికులు, వీర మహిళల అంకితభావం నాకు మరింత పట్టుదలను పెంచిందని నాగబాబు తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.