Nagababu in Munich : 2024లో జనసేన ప్రభుత్వం వచ్చి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. మ్యూనిచ్ లో జరిగిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు. పైసీపీ నాయకులకు డబ్బు సంపాదించాలనే ద్యాస తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష లేదు. దేశానికి స్వాతంత్య్ర్యం వచ్చాక ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి ఆంద్రాలో జరుగుతోంది. ప్రకృతి వనరులు దోచుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లకు పడగలెత్తుతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు ప్రజలను మనుషులుగా చూడటం మాసేసి ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, కులం, మతం, ప్రాంతాలుగా విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. కుల, మతం, ప్రాంతాలకు అతీతంగా రాజకీయం ఉండాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారని తెలిపారు. సోమవారం జర్మనీ దేశంలోని మ్యూనిచ్ నగరంలో ఎన్ఆర్ఐ జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ…. “దేశం దాటి వచ్చిన వారికి మాతృభూమి విలువ తెలుస్తుంది. సముద్రాలు దాటి వచ్చినా మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నందుకు అభినందనలు, గత పది రోజులుగా ఐరోపాలోని వివిధ దేశాల్లో పర్యటించాను. వేలాది మంది జనసేన సానుభూతిపరులను కలిశాను. ఎంతగానో ఆదరించిన మీ అందరికి కృతజ్ఞతలు. షేర్లు లాభాల్లో వాటాలు అడుగుతున్నారు.
రాజకీయాలను సేవా మార్గంగా చూడాలి. వ్యాపారంగా చూస్తే అభివృద్ధి మందగిస్తుంది. మన రాష్ట్రంలో రాజకీయం వ్యాపారంగా మారిపోవడంతో అభివృద్ధి కుంటు బడిపోయింది. పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు వణికిపోతున్నారు. వైసీపీ నాయకులకు లంచాలు ఇవ్వలేక చాలా కంపెనీలు రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టాలంటే కంపెనీలో పేర్లు అడుగుతున్నారు. లాబాల్లో వాటాలు అడుగుతున్నారు.
ఇవ్వకపోతే రకరకాల కారణాలతో వేదిస్తున్నారు. ల్యాండ్, సౌండ్, మైన్స్. ఇలా అందినకాడికి ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. భవిష్యత్తు తరాలకు వాటి ఆనవాళ్లను కూడా మిగల్చడం లేదు. రుషికొండకు బోడి గుండు కొట్టేశారు. జగనన్న కాలనీల పేరుతో వేలకోట్లు దోచేశారు. మనకెందుకులే అని మనం రాజకీయాలను పట్టించుకోకపోయినా… రాజకీయాలు మనల్ని పట్టుకొనే ఉంటాయని గుర్తించాలి అని నాగబాబు వెల్లడించారు.