Nagababu : జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత నాగబాబు తన అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 2019 ఎలక్షన్స్ తర్వాత నుండి నాగబాబు పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు, పార్టీలో పదవి చేపట్టాలనే ఆలోచన లేకుండా, పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విధంగానే తన అడుగులు సాగాయని నాగబాబు చెప్పారు.
ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని , ఈరోజు పార్టీ అధినేత, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రధాన కార్యదర్శి గా నియమించి ,నా బాధ్యతలను మరింత పెంచారని, ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
ఇప్పటికే జనసేన పార్టీలో ఉన్న జనసైనికులు, వీర మహిళలు, అధికార పార్టీని ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ ఉన్నారు. ఇకమీదట వారిని ప్రోత్సహిస్తూ, దిశా నిర్దేశం చేస్తూ, నేను కూడా వాళ్లతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు నాగబాబు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆస్ట్రేలియా నేను ఎక్కువగా పర్యటించాను.
ఎక్కడ చూసినా కూడా జన సైనికులు, వీర మహిళలు అధికార పార్టీ పనితీరును, అవినీతిని బట్టబయలు చేస్తూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా న్యాయంగా, ఏదో అధికార పార్టీని విమర్శిస్తున్నట్టు కాకుండా సద్విమర్శన చేస్తూ అధికార పార్టీ పనితీరును బట్టబయలు చేస్తూ గట్టి ప్రతిపక్షంగా ఉన్నారు.
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎంతో త్యాగం చేస్తూ, వారి సమస్యలను పరిగణలోకి తీసుకొని ,వారి వెన్నంటే నడవాలని చాలా తాపత్రయపడుతూ, శ్రమ పడుతున్నారు. ఇకమీదట మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను, ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.
ఇంకా మెరుగ్గా పార్టీ కోసం మా సేవలను కొనసాగిస్తాము.పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చారు. అంతే నిజాయితీతో ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నారు. ఆయన ఆలోచన ఎప్పుడు ప్రజల గురించే ఉంటుంది. అది ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఇప్పుడు నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఒక అధికారం లాగా కాకుండా దాని నుండి పార్టీ నాయకులతో, కార్యకర్తలతో, ప్రజలతో ఎలా మమేకం కావాలి, వారికి ఎలా ఉపయోగపడాలి అనేది ఆలోచిస్తాను, దానిని ఏప్పుడూ అధికారం గా చూడను. పార్టీ కోసం నా బాధ్యతగా ఫీల్ అవుతాను అని నాగబాబు చెప్పారు.