Nagababu : గల్ఫ్ దేశాల పర్యటనలో జనసేన పార్టీ కార్యదర్శి నాగబాబు గారు మూడు రోజుల నుంచి పర్యటిస్తున్న విషయం మనకు విదితమే. గల్ఫ్ దేశాల ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళల ఆత్మీయ సమావేశంలో నాగబాబు గారు జనసేన ఆత్మీయ వేడుకలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళలు ఎన్నికల సమయంలో కూడా ఇదే ఉత్సాహం కొనసాగించాలని ఆయన తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళల ఆత్మీయ సమావేశం దుబాయ్ దేశం అజ్మాన్ నగరంలోని మైత్రీ ఫాంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు ఎన్.అర్.ఐ. జన సైనికులను, వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గల్ఫ్ ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళలు గత
మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులుగా ఆతిథ్యం ఇచ్చిన విధానం చాలా సంతృప్తిగా ఉందన్నారు, అవకాశం వస్తే మరొక్క సారి గల్ఫ్ దేశాలు పర్యటిస్తానని అని నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి ఆస్ట్రేలియా ఎన్.అర్.ఐ. జనసైనికులు, వీర మహిళల సమన్వయకర్త కొలికొండ శశిధర్ మాట్లాడుతూ.. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ముఖ్యఅతిథిగా మాకోసం ఇంత దూరం రావడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల నుండి వందలాది మంది జనసైనికులు, వీరమహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.