Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే.. మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్‌పై అఫీషియల్ క్లారిటీ
Mokshagna: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ‘నటసింహ’ హవా నడుస్తోంది. ‘అఖండ’, ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’, ‘అఖండ 2’ సినిమాలతో బాక్సాఫీస్ వేటకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమాల సందడి ఇలా ఉండగానే, గోవా వేదికగా బాలయ్య చేసిన ఒక అనౌన్స్‌మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ శుభవార్తను బాలయ్య స్వయంగా వెల్లడించారు.
ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (IFFI) పాల్గొన్న బాలకృష్ణ, మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి నోరు విప్పారు. క్లాసిక్ హిట్ ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా రాబోతున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చిత్రం కచ్చితంగా ఉంటుందని ధృవీకరించారు. అంతేకాదు, ఈ సినిమాలో తాను మరియు తన కుమారుడు మోక్షజ్ఞ నందమూరి కలిసి నటించబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు. “ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే పట్టాలెక్కుతుంది.. నేను, మోక్షజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాం” అని బాలయ్య చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ అప్పట్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడు దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత అదే మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. అయితే ఈ ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
బాలయ్య ప్రకటనతో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ‘ఆదిత్య 999 మ్యాక్స్’ మోక్షజ్ఞకు రెండవ సినిమా అవుతుందా? లేక తండ్రితో కలిసి ఇదే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా, వెండితెరపై తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్న అభిమానుల కల త్వరలోనే నెరవేరబోతోంది.
