Nandamuri Mokshagna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ లుక్ వైరల్..!
Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం అతి త్వరలోనే రాబోతోందా? నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించిన ఓ కొత్త ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి అభిమానులు ఆయన తెరంగేట్రానికి సిద్ధమయ్యాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలో మోక్షజ్ఞ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కొత్త స్టైల్‌తో పాటు సాంప్రదాయ దుస్తులలో ఆయన మెయింటైన్ చేస్తున్న క్లాసిక్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటో చూసిన నందమూరి ఫ్యాన్స్.. ‘డెబ్యూ మూవీ కోసమే ఈ కూల్ లుక్ మెయింటెయిన్ చేస్తున్నాడని’, ‘తండ్రికి తగ్గ కొడుకులా యంగ్ లయన్‌లా ఉన్నాడని’ ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మోక్షజ్ఞ ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడం, మళ్లీ ‘ఆదిత్య 999’ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
గతంలో మోక్షజ్ఞ తెరంగేట్రంపై వచ్చిన పుకార్లకు ఆదిత్య 999 సినిమా ఓపెనింగ్ అనేది వాయిదా పడింది. అప్పట్లో బ్లాక్‌బస్టర్ సినిమా ‘హను మాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞతో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. బాలకృష్ణ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వాయిదా పడింది.
అప్పట్లో ప్రశాంత్ వర్మ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం, అలాగే మోక్షజ్ఞ కూడా నటన, డ్యాన్స్, ఇతర స్కిల్స్‌పై పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోవడం కోసమే ఈ గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో తండ్రి బాలయ్యకు తగ్గ తనయుడిగా, యంగ్ లయన్‌గా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ సంపాదించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.