Nara Lokesh – Na Anveshana : యూట్యూబ్ లో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అన్వేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. “నా అన్వేషణ” అనే యూట్యూబ్ ఛానల్ తో ప్రపంచాన్ని ప్రేక్షకుల కళ్ళకు కడుతున్నాడు అన్వేష్. ఇప్పుడు ఈ పేరు కొత్తగా ఆంధ్ర రాజకీయాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా నారా లోకేష్, అన్వేష్ పేరు వార్తల్లోకి వచ్చింది.
విషయంలోకి వెళ్తే.. నారా లోకేష్ ,నా ఆన్వేషణకి ఐదు కోట్లు డబ్బులు ఇచ్చాడని ఒక వార్త ప్రచారము జరుగుతుంది. అన్వేష్ రీసెంట్ గా నా అన్వేషణ ఛానల్ ద్వారా ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి ఒక వీడియోని చేశాడు. ఆ వీడియో మీదనే ఇప్పుడు నారా లోకేష్, అన్వేష్ కి ఐదు కోట్లు ముట్ట చెప్పాడని ఒక వార్తని తెరమీదకి తీసుకోవచ్చారు.

కానీ ఈ వార్తలో అసలు నిజం లేదని నారా లోకేష్ ఖండించారు. ఇది కేవలం ప్రచారం మాత్రమే. కావాలనే ఎవరో చేస్తున్నారు. అదంతా అబద్ధమని ఆయన వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపాలని లేకపోతే అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ఆయన తెలిపారు.
వైసీపీ ఇచ్చే ఐదు రూపాయల పేటియం కోసం కొందరు ప్రశ్నిస్తున్న వారిని ఇలా నిందిస్తున్నారు అని, రాష్ట్ర భవిష్యత్తుపై నా అన్వేషణ ఛానల్ చేసిన వీడియో చాలా ప్రశంసనీయమైనది అని ఆయన ట్వీట్ చేశారు.
