Nara Lokesh Yuvagalam Padayatra : తెలుగుదేశం పార్టీలో హడావిడి మళ్లీ మొదలైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను ఈరోజు తిరిగి ప్రారంభించనున్నారు. దానికోసం ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకుని నిన్న రాత్రి రాజమండ్రి చేరుకున్నారు. ఆయనకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. పాదయాత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గతంలో పాదయాత్రలో లోకేష్ 2852.4 కి.మీ.నడిచారు. ఆయనకు విశేష స్పందన లభించింది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది.ఈరోజు లోకేష్ పాదయాత్రను 210 వ రోజును పొదలాడలో కొనసాగించి, రాత్రికి అమలాపురం నియోజకవర్గం లో బసచేస్తారు. తన షెడ్యూల్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న లోకేష్ మొదటి రోజు మధ్యాహ్నం 12:35 కి పి .గన్నవరం నియోజకవర్గం చేరుకొని

అక్కడ గెయిల్, ONGC బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ,రెండు గంటలకు మామిడికుదురులో సమావేశానికి హాజరవుతారు. ఆపైన 2:45 కి పాశర్లపూడిలో బోజన విరామం తీసుకుంటారు. తిరిగి సాయంత్రం లోకేష్ పాదయాత్ర పాశర్లపూడి నుంచి మొదలిపెట్టి. 4.30కి అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశమవుతారు. 5.30కి అమలాపురం నియోజకవర్గంలో చేరుకుంటారు. 6.30కి బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి లో పాల్గొంటారు.
రాత్రి 7.30కి పేరూరులో రజక సామాజికవర్గీయులతో సమావేశం అవుతారు. ఆ తరువాత రాత్రి 7.45కి పేరూరు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. ఈ విదంగా 15 కిలోమీటర్ల వరకు సాగే పాదయాత్ర అమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని టిడిపి వర్గాలు తెలిపారు. ఇది ఇలా ఉండగా మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు కూడా “చంద్రబాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ” యాత్రకు సంబంధించిన వివరాలు కూడా త్వరలో వెల్లడించనున్నారని వినికిడి.
